The Destiny - ప్రళయ విహంగం


జననం  మరణం  జ్వలనం  ఖననం, నా పేరంటూ మిగిలుంటుందా,
మరొక జన్మం ఉంటుందా, ఈ మరణంతో  పూర్తవుతుందా.

కాలంలో కనుమరుగౌతానా, క్రొత్తగా నేను తిరిగొస్తానా,
అశక్తుడిగానే ఉంటానా, శక్తిని నేనైపోతానా.

 భస్మానికి రెక్కలు తొడిగి, రెపరెపలాడుతూ ఎగిరొస్తానా,
రివ్వున ఎగసే జ్వాలలతో, పరిగెడుతూ కాళుడిలా మరి వస్తానా.

కపటం కలహం దహియించే, కర్తను నేనై నర్తిస్తానా,
అణువణువున నేనే ఉంటానా, ప్రతీ అణువును నేనైపోతానా.

సృష్టిని మార్చే ప్రళయంలో, ఒక భాగాన్నౌతానా,
సప్తవర్ణాల హరివిల్లు చివర, ఒక చిగురునునేనై ఉంటానా.

Janana maraa jvalana khanana, nā pēraṇṭū migiluṇṭundā
maroka janma
uṇṭundā, ī maraantō pūrtavutundā.

Kālanlō kanumarugautānā, krottagā nēnu tirigostānā,
aśaktu
igānē uṇṭānā, ā śaktini nēnaipōtānā.

Ā bhasmāniki rekkalu toigi, reparepalāutū egirostānā,
rivvuna egasē jvālalatō, parige
utū ā kāuilā mari vastānā.

Kapaa kalaha dahiyin̄cē, ā kartanu nēnai nartistānā,
a
uvauvuna nēnē uṇṭānā, pratī auvunu nēnaipōtānā.

Ī sr̥ṣṭini mārcē praayanlō, oka bhāgānnautānā,
saptavarāla harivillu civara, oka cigurununēnai uṇṭānā.


Pic courtesy: http://www.william-turner.org/

0 comments:

Post a Comment