The Destiny - ప్రళయ విహంగం


జననం  మరణం  జ్వలనం  ఖననం, నా పేరంటూ మిగిలుంటుందా,
మరొక జన్మం ఉంటుందా, ఈ మరణంతో  పూర్తవుతుందా.

కాలంలో కనుమరుగౌతానా, క్రొత్తగా నేను తిరిగొస్తానా,
అశక్తుడిగానే ఉంటానా, ఆ శక్తిని నేనైపోతానా.

ఆ భస్మానికి రెక్కలు తొడిగి, రెపరెపలాడుతూ ఎగిరొస్తానా,
రివ్వున ఎగసే జ్వాలలతో, పరిగెడుతూ ఆ కాళుడిలా మరి వస్తానా.

కపటం కలహం దహియించే, ఆ కర్తను నేనై నర్తిస్తానా,
అణువణువున నేనే ఉంటానా, ప్రతీ అణువును నేనైపోతానా.

ఈ సృష్టిని మార్చే ప్రళయంలో, ఒక భాగాన్నౌతానా,
సప్తవర్ణాల హరివిల్లు చివర, ఒక చిగురునునేనై ఉంటానా.

Jananaṁ maraṇaṁ jvalanaṁ khananaṁ, nā pēraṇṭū migiluṇṭundā, 
maroka janma
ṁ uṇṭundā, ī maraṇantō pūrtavutundā.

Kālanlō kanumarugautānā, krottagā nēnu tirigostānā,
aśaktu
ḍigānē uṇṭānā, ā śaktini nēnaipōtānā.

Ā bhasmāniki rekkalu toḍigi, reparepalāḍutū egirostānā,
rivvuna egasē jvālalatō, parige
ḍutū ā kāḷuḍilā mari vastānā.

Kapaṭaṁ kalahaṁ dahiyin̄cē, ā kartanu nēnai nartistānā,
a
ṇuvaṇuvuna nēnē uṇṭānā, pratī aṇuvunu nēnaipōtānā.

Ī sr̥ṣṭini mārcē praḷayanlō, oka bhāgānnautānā,
saptavarṇāla harivillu civara, oka cigurununēnai uṇṭānā.


Pic courtesy: http://www.william-turner.org/